PPM: దీపావళీ పండగ నేపథ్యంలో మందుగుండు సామగ్రి కొనుగోలుదారులతో దుకాణాల వద్ద జనాలతో కిక్కిరిసిపోయింది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కొత్తవలస అగ్నిమాపక దళం సిబ్బంది దుకాణాల వద్ద ఔట్ పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ఫైర్ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. ముందుస్తు చర్యలలో భాగంగా ప్రతి దుకాణం వద్ద నీళ్ళతో కూడిన రెండు వాటర్ డ్రమ్ములు, ఇసుకను ఉంచారు.