MNCL: సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన చెన్నూరు పట్టణానికి చెందిన ముత్యాల రవికుమార్ గౌడ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI దేవేందర్రావు ప్రకటనలో తెలిపారు. నిరాధారమైన ఆరోపణలతో పాటు తమ శాఖ అధికారులు, సిబ్బందిపై అవమానకరమైన సందేశాలు పోస్టు చేశాడని పేర్కొంటూ TSMDC ప్రాజెక్టు అధికారి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.