PLD: క్రోసూరు మండలం పీసపాడులో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు గాయపడ్డారు. త్రివేణి అనే మహిళ వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.