నగర పరిధిలోని చిన్న మాచుపల్లిలో హిందూ స్మశాన వాటిక కంపచెట్లతో నిండిపోయింది. స్మశాన వాటిక లోపలి భాగంతో పాటు ముందు భాగం వైపు కంపచెట్లు దట్టంగా పెరిగాయి. అంత్యక్రియలు నిర్వహించాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. స్మశాన వాటికలో కంపచెట్లు తొలగించి నీటి సదుపాయం కల్పించాలని స్థానిక గ్రామస్థులు కోరుతున్నారు.