NRPT: బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సోమవారం కృష్ణ ఎస్సై నవీన్ అన్నారు. మండల ప్రజలందరికీ ఆయన దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీపావళి వెలుగుల పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా భద్రత చర్యలు పాటించాలని సూచించారు.