SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన ఆకుల శ్రీకాంత్ గౌడ్ అనారోగ్యంతో మస్కట్లో మృతి చెందాడు. బతుకుదెరువుకు మస్కట్ దేశం వెళ్లిన శ్రీకాంత్ మరణించాడన్న సమాచారం అందడంతో కుటుంబ సబ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంధుమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శ్రీకాంత్ మృతదేహాన్ని స్వగ్రామానికి వెంటనే రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు