KMM: నగరంలోని 30, 34, 35 డివిజన్లలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మేయర్ పునుకొల్లు నీరజ ఆదివారం పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన వారికి మంత్రి తుమ్మల చొరవతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇండ్లు మంజూరైన లబ్దిదారులు సకాలంలో ఇండ్లను నిర్మించుకోవాలని సూచించారు.