పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో నిన్న జరిగిన తొలి వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గతంలో ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా ఆడిన 3 వన్డేల్లోనూ ఓటమి పాలైంది. భారత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆ చెత్త రికార్డును ఆసీస్ చెరిపివేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 26 ఓవర్లకు కుదించారు.