MHBD: మరిపెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులపై దాడి చేసి, బూతులు తిట్టి, బెదిరించిన 12 మందిపై కేసు నమోదైందని సెకండ్ SI కోటేశ్వరరావు ఇవాళ తెలిపారు. శనివారం బీసీ రిజర్వేషన్ల బంద్ సమయంలో మరిపెడ బస్టాండ్ వద్ద గొడవ జరిగింది. కొండం దశరథ్ ఫిర్యాదు మేరకు 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కోటేశ్వరరావు పేర్కొన్నారు.