WGL: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల ఆదాయం గణనీయంగా తగ్గడంతో గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు. 2023-25లో 16,089 దరఖాస్తులతో రూ.318 కోట్లు వచ్చాయి. 2025-27కు 9,754 దరఖాస్తులతో రూ.292.4 కోట్లు మాత్రమే లభించాయి. గత టెండర్లతో పోలిస్తే 6,285 దరఖాస్తులు తగ్గాయి. రూ.320.7 కోట్ల లక్ష్యం సాధ్యమవుతుందా అని ఆసక్తి నెలకొంది.