NDL: బండిఆత్మకూరులో బస్టాండులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంపై వేసిన సుంకాల విధింపునకు వ్యతిరేకంగా సోమవారం ప్రజాసంఘాల నాయకులు నిరసన చేపట్టారు. సీఐటీయూ నాయకులు రత్నమయ్య మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలను వేయడంతో అనేక రకాల పరిశ్రమలు దెబ్బతిని ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డాయని అన్నారు. ఉపాధి కోల్పోయే పరిశ్రమలకు రక్షణ కల్పించాలన్నారు.