SDPT: హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, శాంతి, ఐక్యత, అభివృద్ధి దీపాల వలె విరజిల్లాలని, రాష్ట్రానికి మరింత వెలుగులు తెచ్చి అభివృద్ధి పథంలో నడిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.