MNCL: టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని జన్నారం మండల అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. దీపావళి నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా గడ్డివాములు ఉన్నచోట్ల టపాసులు కాల్చవద్దని ఆయన సూచించారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు దగ్గర ఉండాలని ఆయన కోరారు.