SKLM: బూర్జ మండలం పాలవలస గ్రామానికి చెందిన ఎ .ఢిల్లీశ్వ రావు గత ఏడాది బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ ప్రజలకు భంగం కలిగించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమదాలవలస జేఎంఎఫ్సీ కోర్టు ఈ నెల 18 నుంచి 24 వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు ఎస్సై ప్రవళిక ఆదివారం తెలిపారు. నిందితున్ని అంపోలు జైలుకు తరలించామన్నారు.