SRD: జిల్లాలోని 37 పిఎంసి పాఠశాలలకు కరాటే కోసం 10.75 లక్షల నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటనలో తెలిపారు. 50 మందికి పైగా బాలికలు ఉన్న 36 పాఠశాలకు 50 వేలు, 50 మంది కంటే తక్కువ ఉన్న ఒక్క పాఠశాలకు 25వేల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు. నవంబర్ నుంచి జనవరి వరకు విద్యార్థులకు కరాటేను నేర్పిస్తారని తెలిపారు.