ASF: పీఎం స్వనిధి పథకం కింద అందించే రుణాలను వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ రాజేందర్ ప్రకటనలో తెలిపారు. చిరు వ్యాపారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే రుణాలు తీసుకొని తమ వ్యాపారాన్ని విస్తరించుకొని ఆర్థికంగా బలపడాలన్నారు. కొత్త సంఘాలకు ఈ రుణాలు వరం లాంటివని పేర్కొన్నారు.