TG: మావోయిస్టులను కేవలం 3 జిల్లాలకే పరిమితం చేయడంలో కేంద్రం విజయం సాధించిందని ప్రధాని మోదీ తెలిపారు. 11 ఏళ్ల క్రితం 125 జిల్లాల్లో విస్తరించి ఉన్న మావోయిస్టులు, ఇప్పుడు 3 జిల్లాలకే పరిమితమయ్యారని ప్రకటించారు. మావోయిస్టు రహితంగా దేశాన్ని మార్చడమే తమ లక్ష్యమన్నారు. వేల మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని, ఇది గొప్ప పరిణామమని ప్రధాని పేర్కొన్నారు.