TG: నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ను హత్య చేసిన రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిన్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే సమయంలో జరిగిన ఘర్షణలో గాయపడ్డాడు. దీంతో పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇవాళ రియాజ్ కానిస్టేబుల్ నుంచి గన్ తీసుకుని కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని ఎన్కౌంటర్ చేశారు.