SRD: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్, కంది గ్రామానికి చెందిన ఉస్మాన్ గుండెపోటుతో సోమవారం మరణించారు. తెల్లవారుజామున ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా చాతిలో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఉస్మాన్ మృతికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, తెలంగాణ ఉద్యమకారులు సంతాపం తెలిపారు.