W.G: దీపావళి సందర్భంగా తణుకులోని బాణసంచా దుకాణాల వద్ద పండగ వాతావరణం నెలకొంది. పట్టణ పరిధిలోని పైడిపర్రు వద్ద 40 దుకాణాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులు అమ్మకాలకు అవకాశం కల్పించారు. తొలి రెండు రోజులు పెద్దగా వ్యాపారాలు జరగలేదు. ఇవాళ దీపావళి కావడంతో కొనుగోలుదారులు షాపుల వద్ద బారులుదీరారు. మరోవైపు సోమవారం వర్షం విరామం ఇవ్వడంతో వ్యాపారులు ఊపందుకున్నాయి.