WGL: వరంగల్ జిల్లా ACB కార్యాలయంలో ఇవాళ ACB DSP సాంబయ్య మాట్లాడుతూ.. ఏసీబీ పేరుతో కొందరు మోసగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. 9886826656, 9880472272, 9591938585 నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను నమ్మవద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమానాస్పద కాల్స్ గురించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.