మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మావోయిస్టుల ఏరివేతకు ‘ఆపరేషన్ కంగారు’ చేపట్టామన్నారు. వారు రోడ్లు, సెల్ టవర్లు, పాఠశాలలు, ఆస్పత్రులు కట్టకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని, ఇప్పుడు అవి ఊపందుకున్నాయని పేర్కొన్నారు. వారికి భారత్లో చోటు లేదని మోదీ స్పష్టం చేశారు.