భారత క్రికెట్ జట్లకు ఒకే రోజు రెండు ఓటములు ఎదురయ్యాయి. భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఓడిపోగా, మహిళల జట్టు ఇంగ్లండ్తో గెలవాల్సిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అలాగే, చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన రోహిత్, కోహ్లీ కూడా ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఓటములతో సగటు క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.