KMR: రైఫిల్ షూటింగ్ కమ్ సెలక్షన్ అండర్ 17 విభాగంలో బిక్కనూర్ మండలం జంగంపల్లికి చెందిన పేరం అక్షిత ప్రథమ స్థానంలో నిలిచింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కన్వీనర్ విజయ్ శేఖర్ విద్యార్థినికి గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు హుస్సేన్, సాహశ్రీ, నిరంజన్ రెడ్డి, జీవన జ్యోతి పాల్గొన్నారు.