SRD: ఉపాధ్యాయులతో పర్యవేక్షణ కమిటీలు వేయవద్దని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి కోరారు. జహీరాబాద్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులను పర్యవేక్షణ కమిటీలు నియమించడం వల్ల బోధన కుంటుపడే అవకాశం ఉందని చెప్పారు. ఇతర వారితో పర్యవేక్షణ కమిటీలు వేయాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.