SRD: దివ్యాంగుల- విద్య- ఉపాధి సంక్షేమం- సాధికారత అంశంపై ఈనెల 25వ తేదీన హైదరాబాదులోని కమలా నగర్లో ఉన్న భాస్కరరావు భవన్లో ఉదయం 11 గంటలకు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మంగళవారం తెలిపారు. దివ్యాంగులు జాతీయ సదస్సుకు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.