NLR: జిల్లాలో ఇవాళ ఉదయాన్నే పెను ప్రమాదం తప్పింది. కొంతమంది ప్రయాణికులతో కావలి నుంచి చామదలకు ఆర్టీసీ బస్ బయల్దేరింది. జలదంకి మండలం 9వ మైలు వద్ద ఎదురుగా ఓ లారీ రావడంతో దానిని తప్పించబోయే క్రమంలో రోడ్డు పక్కన పొలాల్లో బస్ బోల్తా కొట్టింది. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.