శ్రీకాకుళం జిల్లాలో రేపటి నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా జలుమూరు మండలంలోని శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం, టెక్కలి మండలంలోని రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో ముస్తాబయ్యాయి. ప్రతిదినం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు నిర్వహిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు దర్శించుకుంటారు.