GNTR: తెనాలికి చెందిన మణికంఠను కిడ్నాప్, హత్యాయత్నం నుంచి పోలీసులు తప్పించారు. త్రీ టౌన్ సీఐ సాంబశివరావు తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె లిఖితను దూరం చేస్తున్నాడనే కోపంతో ఆదివారం మణికంఠ అత్త విజయలక్ష్మి ఈ కుట్ర పన్నింది. ఆమె మరో నలుగురితో కలిసి మణికంఠను చంపేందుకు ప్రయత్నించింది. పోలీసులు వెంటనే స్పందించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.