ప్రకాశం: మర్రిపూడి మండలం జువ్విగుంట నుంచి తంగేళ్ల వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు అద్వానంగా తయారైంది. దీనిపై ప్రయాణించాలంటే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా ఈ రహదారి కందుకూరు- కనిగిరి రోడ్డుకు అనుసంధానంగా ఉండడంతో ఈ రోడ్డుపై భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీంతో ఈ రోడ్డు తరచూ మరమ్మతులు చేసినప్పటికీ గుంతలమయమవుతుందని వాహనదారులు వాపోయారు.