HYD: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, అందమైన పూలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపావళి ప్రత్యేక హారతి, ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీప కాంతులతో ఆలయం రూపుదిద్దుకుంది. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.