BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం మాట్లాడుతూ.. చెడు పై మంచి విజయానికి ప్రతీకగా దీపావళి పండగను జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.