HNK: ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన మహమ్మద్ విలాయత్ అలీ డిప్యూటీ కలెక్టర్గా నియమితులైన సందర్భంగా సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని కృషితో ఉన్నత స్థానాలు సాధించాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే సూచించారు.