ప్రకాశం: గిద్దలూరులో కుక్క తన ఇంటి ముందుకు వచ్చిందని కుక్క యజమానురాలైన వృద్ధురాలిపై ఓ మహిళ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో వృద్ధురాలికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.