KMR: తడిసిన రేషన్ బియ్యాన్ని ఈనెల 22న వేలం పాట వేయనున్నట్లు గాంధారి తహశీల్దార్ రేణుక చౌహన్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు రేషన్ షాపుల్లో ఉన్న 60 క్వింటాళ్ల బియ్యం తడిసిపోయిందని చెప్పారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదేశాల మేరకు వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు వేలంపాటలో పాల్గొనాలని ఆమె సూచించారు.