NLG: అకాల వర్షం కారణంగా డిండిలోని కందుకూరు వాగు వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్లో ఏర్పడిన లీకేజీ మరమ్మత్తులు పూర్తయ్యాయి. దీంతో గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన డిండి, చందంపేట మండలాల్లోని 92 గ్రామాలకు నేటి నుంచి తాగునీరు సరఫరా కానుంది. ఎమ్మెల్యే బాలు నాయక్ సహకారంతో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు పనులు తొందరగా పూర్తి చేయించారు.