దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక వెలుగుల పండుగ అని అన్నారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకోవాలి. పర్యావరణానికి అనుకూలంగా దీపావళి జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.