ATP: గార్లదిన్నె మండలం కనుంపల్లి వద్ద మంగళవారం జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. అనంతపురం వెళ్లే పల్లె వెలుగు బస్సును కారు ఓవర్ టేక్ చేసే సమయంలో వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కారు పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.