HYD: దీపావళి వేళ నగరంలో వాయు కాలుష్యం తీవ్రమైంది. గ్రీన్ ఫైర్ వర్క్స్ పేరుతో నకిలీ పటాకులు విక్రయించడంతో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి పడిపోయింది. సాధారణ దినాలతో పోలిస్తే కాలుష్యం 86% వరకు పెరిగింది. ధూళి, పొగ కమ్ముకున్న నగర వాతావరణం ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది.