VSP: కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీ పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ఈ సర్వీసులు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. లగ్జరీ, డీలక్స్, ఇంద్ర సర్వీసులకు సంబంధించి వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. మరిన్ని వివరాలకు డిపోలో సంప్రదించాలని అధికారులు కోరారు.