ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జేవీజీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. హైదరాబాద్లోని ఏరో స్పేస్, ఎలివేటర్స్ తయారీ యూనిట్లలో దాదాపు 200 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.