నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సూచించారు. తీవ్రమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు, పిల్లలు, వృద్ధులు భద్రతా కారణాల దృష్ట్యా ఇంటి వద్దనే ఉండాలన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.