JN: ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ హన్మకొండ జిల్లా జాయింట్ సెక్రటరీగా స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లి గ్రామానికి చెందిన ఉడుత గణేష్ ఎంపిక అయినట్లు రాష్ట్ర అధ్యక్షుడు మెరుగు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ మాట్లాడుతూ.. మానవ హక్కులకై పోరాడి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి కృషి చేస్తానన్నారు. ప్రతి పౌరుడు తమ హక్కులు తెలుసుకోవాలన్నారు.