NZB: కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ దాడిలో గాయపడిన ఆసిఫ్‌ను డీజీపీ శివధర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం పరామర్శించారు. ఆసిఫ్ ధైర్యసాహసాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి గ్యాలంట్రీ మెడల్ కోసం సిఫార్సు చేస్తామన్నారు. ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితిపై డీజీపీ ఆరా తీశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డీజీపీ తెలిపారు. ఆయన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.