ప్రకాశం : కార్తీకమాసం సందర్భంగా పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ చెప్పారు. అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమేశ్వరారామం, పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని భీమేశ్వరారామం, సామర్లకోటలోని కుమారామం క్షేత్రాలను భక్తులు దర్శించుకునేందుకు గిద్దలూరు, కనిగిరి, ఒంగోలు నుంచి ప్రతి ఆదివారం రాత్రి బస్ లు ఉంటాయన్నారు.