TPT: తిరుపతిలో బుధవారం ఉదయం విషాద ఘటన జరిగింది. మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడ వారధి ఫ్లైఓవర్ పైనుంచి ఓ వ్యక్తి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.