BDK: అశ్వరావుపేట మండలం నుండి ముఖ్యమంత్రి సహాయనిధి కోసం స్వీకరించిన దరఖాస్తులను బుధవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సచివాలయంలో సంబంధిత అధికారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి నిరుపేద కుటుంబానికి సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందన్నారు.