PLD: మాచవరం మండలం మొర్జంపాడులోని భ్రమరాంబా సమేత బుగ్గ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీకమాస ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని ఆలయ శాశ్వత ధర్మకర్త మండాది హరినాథ్ తెలిపారు. ప్రతిరోజు స్వామి వారికి ప్రత్యేక పూజలతోపాటు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. భక్తుల దర్శనం కోసం ఆలయంలో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.