AP: రాష్ట్ర TDP ఉపాధ్యక్షుడు, ఆగ్రోస్ ఛైర్మన్ సుబ్బానాయుడు మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కావలిలో పార్టీ బలోపేతానికి సుబ్బానాయుడు కృషి చేశారని అన్నారు. నిబద్ధత, అంకితభావం కలిగిన నాయకుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. సుబ్బానాయుడు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.