MBNR: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ మేరకు పుష్పగుచ్చం అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలు, డీసీసీ అధ్యక్షులు ఎన్నికలపై వారికి వివరించారు. అనంతరం ఇరువురు రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.